Saturday, 8 October 2016

ఇండియ‌న్ పోస్టు పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్‌లో 650 స్కేల్‌-1 ఉద్యోగాలు

ఇండియ‌న్ పోస్టు పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్‌లో 650 స్కేల్‌-1 ఉద్యోగాలు

- డిగ్రీ చ‌దివిన‌వారికి అవ‌కాశం
భార‌తీయ పోస్టల్‌కు చెందిన ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ 650 స్కేల్‌-1 ఆఫీస‌ర్ (అసిస్టెంట్ మేనేజ‌ర్‌) ఉద్యోగాల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లు ఈ పోస్టుల‌కు పోటీప‌డొచ్చు.రాత‌ప‌రీక్ష (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌), ఇంట‌ర్వ్యూ ల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. స్కేల్‌-1 పోస్టుల నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.
ఖాళీల వివ‌రాలు
స్కేల్‌-1 ఆఫీస‌ర్(అసిస్టెంట్ మేనేజ‌ర్‌) -650 (జ‌న‌ర‌ల్ 327, ఓబీసీ 176, ఎస్సీ 98, ఎస్టీ 49)
అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 20-30 ఏళ్లు ( సెప్టెంబ‌రు 2, 1986 కంటే ముందు; సెప్టెంబ‌రు 1, 1996 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు) ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో సడ‌లింపులు వ‌ర్తిస్తాయి.
ప‌రీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో... చీరాల‌, చిత్తూరు, గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం. తెలంగాణ‌లో...హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.150. మిగిలిన అంద‌రికీ రూ.700
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబ‌రు 4
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 25
ప‌రీక్ష తేదీలు: డిసెంబ‌రు, జ‌న‌వ‌రిల్లో ప్రిలిమ్స్‌, మెయిన్స్ నిర్వహిస్తారు.
హాల్ టికెట్లు: ప‌రీక్షకు వారం రోజుల ముందు నుంచి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
వెబ్‌సైట్‌: www.indiapost.gov.in
ఎంపిక విధానం: 
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష, మెయిన్ ఎగ్జామినేష‌న్‌, ఇంట‌ర్వ్యూల ద్వారా. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన‌వాళ్లే మెయిన్స్‌కు
ఎంపిక‌వుతారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. మెయిన్స్‌లో అర్హుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు. మెయిన్స్‌, ఇంట‌ర్వ్యూ మార్కుల‌ను తుది ఎంపిక‌కు ప్రామాణికంగా తీసుకుంటారు.
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష
మొత్తం వంద మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. వంద ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప‌రీక్ష వ్యవ‌ధి ఒక గంట‌. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30, రీజ‌నింగ్ ఎబిలిటీ 35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు వ‌స్తాయి. అర్హత సాధించాలంటే ప్రతి సెక్షన్‌లోనూ నిర్దేశిత క‌టాఫ్ మార్కులు పొందాలి. అలాగే నిర్దేశిత స్కోర్ పొంద‌డ‌మూ త‌ప్పనిస‌రి. వీటిని పోస్టు పేమెంట్ బ్యాంకు నిర్ణయిస్తుంది.
మెయిన్స్ ఇలా...
మెయిన్స్‌లో మొత్తం 200 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం ప్రశ్నప‌త్రానికి 200 మార్కులు. ప‌రీక్ష వ్యవ‌ధి 140 నిమిషాలు. మొత్తం 5 సెక్షన్లు ఉంటాయి. నిర్దేశిత వ్యవ‌ధిలో ఆ సెక్షన్ ప్రశ్నల‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనిప్రకారం రీజ‌నింగ్ 50 ప్రశ్నల‌ను 40 నిమిషాల్లోనూ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 30 నిమిషాల్లోనూ, కంప్యూట‌ర్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు ప‌ది నిమిషాల్లోనూ, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలు 20 నిమిషాల్లోనూ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 40 నిమిషాల్లోనూ పూర్తిచేయాలి. మెయిన్స్‌లోనూ అర్హత సాధించాలంటే ప్రతి సెక్షన్‌లోనూ నిర్దేశిత క‌టాఫ్ మార్కులు పొందాలి. అలాగే అన్ని సెక్షన్లూ క‌లుపుకుని క‌నీస మార్కులు పొందాలి.
ప్రిలిమ్స్‌, మెయిన్స్ రెండు ప‌రీక్షల్లోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి త‌ప్పు స‌మాధానానికీ పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు.
ఇంట‌ర్వ్యూ...
మెయిన్స్‌లో అర్హత సాధించిన‌వారికి ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంట‌ర్వ్యూకి వంద మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధించ‌డానికి క‌నీసం 40 మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే క‌నీసం 35 మార్కులు పొందితే స‌రిపోతుంది. మెయిన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల‌కు వెయిటేజీ 80: 20గా నిర్ణయించారు. ఈ రెండింటి స్కోర్ క‌లిపి మెరిట్, రిజ‌ర్వేష‌న్ల ప్రాతిప‌దిక‌న తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.
ఎంపికైతే..
రూ.23,700-42,020 పే స్కేల్‌తో వేత‌నం ఆరంభ‌మ‌వుతుంది. విధుల్లోకి చేరిన‌వారు మొద‌టి నెల నుంచే గ‌రిష్ఠంగా నెల‌కు రూ.65 వేలు వేత‌న రూపంలో పొంద‌వ‌చ్చు. ప‌నిచేసే ప్రాంతాన్ని బ‌ట్టి హెచ్ఆర్ఏ, సిటీ ఆల‌వెన్స్‌లో వ్యత్యాసాలు ఉంటాయి. ఎంపికైన‌వాళ్లు రెండేళ్లపాటు ప్రొబేష‌న్‌లో కొన‌సాగుతారు. అనంత‌రం ప‌నితీరు ప్రాతిప‌దిక‌న శాశ్వత ఉద్యోగులుగా స‌ర్వీస్‌లోకి తీసుకుంటారు.

No comments:

Post a Comment