Sunday, 5 June 2016

Hi friends Good morning!
Good news ........
APPSC - GROUP 2 Preparation Plan
రాష్ట్రంలో గ్రూప్ - II స్థాయి పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో 3 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో జరిగే ఈ పరీక్షలో విజయసాధనకు ఉపకరించే నిపుణుల సలహాలు, సూచనల కోసం క్లిక్ చేయండి.
APPSC Group - II Preparation Plan
2008, 2011, 2012 గ్రూప్-2 పరీక్ష నేర్పిన అనుభవాలే ఇప్పటి అభ్యర్థులకు మార్గదర్శకం కావాలి.
¤ ఎంపికైన అభ్యర్థులు 3 పేపర్లలోనూ సమంగా రాణించారు. అందువల్ల ఎకానమీ పేపరే ఫలితాన్ని నిర్ణయిస్తుందనే అపోహ నుంచి బయటపడాలి.
¤ పేపర్-2 సులభం అనుకుని 130-140 మధ్య రాగలిగిన స్కోరును 110కి కుదించుకుని ఉద్యోగాన్ని చేజేతులా కోల్పోయినవారు కూడా అధికమే.
¤ 2008 ఫలితాల్లో ఎంపికైనవారు అందరూ పేపర్-2, 3లలో దాదాపుగా ఒకే స్థాయిలో ఉన్నారు. మార్కుల్లో తేడాలకు ప్రధాన కారణం- పేపర్-1లో బాగా రాణించటం/ రాణించటం/ రాణించలేకపోవటం.
ఈ మూడు అంశాలనూ దృష్టిలో పెట్టుకుని రాబోయే పరీక్షను విజయవంతంగా ఎదుర్కోవాలి.