Friday, 30 September 2016
Thursday, 29 September 2016
Wednesday, 28 September 2016
ఏపీపీఎస్సీ గ్రూప్ - II స్క్రీనింగ్ టెస్ట్ SYLLABUS
ఏపీపీఎస్సీ
గ్రూప్ - II
స్క్రీనింగ్ టెస్ట్
బి) భారత రాజ్యాంగ సమాఖ్య విధానం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, న్యాయ సమీక్ష, స్థానిక ప్రభుత్వాలు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర - రాష్ట్ర చట్టసభలు, కేంద్ర - రాష్ట్రాల మధ్య పరిపాలన, చట్టపరమైన సంబంధాలు, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల పరిపాలనా తీరు.
సి) భారత ఆర్థికాభివృద్ధి - మధ్యయుగ భారత ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్య్ర పూర్వపు భారత ఆర్థిక వ్యవస్థ, స్వాంతంత్య్రానంతరం దేశంలో అభివృద్ధి ప్రణాళికలు - ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కార్మిక విధానాలు, భారతదేశంలో వ్యవసాయం, హరిత విప్లవం ప్రాధాన్యం, జనాభా, ప్రాంతాల వారీగా ఆర్థిక వ్యత్యాసాలు.
Tuesday, 27 September 2016
Monday, 26 September 2016
పేదరికం ఉన్నా... పోటీలో గెలవడం నేర్చుకున్నా
- అరుణశ్రీ, గ్రూప్-1 విజేత
|
పేదరికంలో ఉన్న కుటుంబానికి ఆలంబనగా నిలవాలనే ఆలోచన.. తొలి విజయానికి పునాది వేస్తే.. ఆ విజయం స్ఫూర్తిగా మరో విజయం.. అదే ఉత్సాహంతో మరో విజయంతో అత్యున్నత స్థాయి ఆర్డీఓ పోస్టు సొంతమవడం.. ఇదీ అరుణశ్రీ సక్సెస్ స్టోరీ. పేదరికంపై పోరాడి పేరుకు తగినట్లుగానే డీఎస్సీ, గ్రూప్-2, గ్రూప్-1 వరుస విజయాలతో ప్రకాశించి.. ప్రస్తుతం ఆర్డీఓగా వరంగల్‌లో శిక్షణ పొందుతున్న కరీంనగర్ జిల్లాకు చెందిన అరుణశ్రీ ఏమంటున్నారంటే..
ఆలంబనగా నిలవాలన్నదే ఆలోచన:
కుటుంబమంతటికీ నాన్న వస్త్ర వ్యాపారమే ఆదాయం. అది కూడా అరకొర సంపాదనే. దీంతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని |
Sunday, 25 September 2016
ఒక పోస్టు నాదే అనుకుని చదివా
- గ్రూప్ 2 ఫస్ట్ ర్యాంకర్ ముప్పాళ్ల వెంకటేశ్వరరావు
|
గ్రూప్-2.. లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడే పరీక్ష.. ఇంత పోటీని తట్టుకుని ఫస్ట్ ర్యాంక్ సాధించడమంటే ఆషామాషీ కాదు. కానీ ఆ యువకుడు పట్టుదలతో అనుకున్నది సాధించాడు... తాను చదివింది బీఫార్మసీ అయినప్పటికీ.. ఆర్ట్స్ సబ్జెక్టులపై పట్టుసాధించాడు. ఆయనే గుంటూరు జిల్లాకు చెందిన ముప్పాళ్ల వెంకటేశ్వరరావు. 2012లో జరిగిన గ్రూప్ 2 పరీక్షలో 380 మార్కులు సాధించారు. ఆయన సక్సెస్ స్టోరీ మీ కోసం!! ఫస్ట్ ర్యాంక్ రావడంపై:పరీక్ష రాసిన తర్వాత టాపర్లలో ఒకడిగా నిలుస్తానని అనుకున్నా. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలుస్తానని అసలు ఊహించలేదు. చదివింది బీ ఫార్మసీ కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలనుకున్నా. కాని టాపర్‌గా నిలవడం జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఈ ఫలితం ద్వారా భవిష్యత్తులో నా లక్ష్యాన్ని సాధించి తీరగలననే నమ్మకం పెరిగింది.విద్యా, కుటుంబ నేపథ్యం:మాది గుంటూరు జిల్లా, తాడికొండ మండలం బండారుపల్లి గ్రామం. వ్యవసాయ కుటుంబం. పదో తరగతి వరకు |
Saturday, 24 September 2016
Friday, 23 September 2016
Bank PO and Clerical Preparation tips (TM)
1. సరైన ప్రణాళిక
2. అమలు ఈ రెండింటిలో స్పష్టత ఉన్నవాళ్లు విజేతలుగా నిలుస్తారు.
సమయంతో పోటీ
బ్యాంక్ పరీక్షకు సిద్ధం అయ్యేవాళ్లు కాలంతో పోటీ పడాలి. ప్రిపరేషన్‌లో, అలాగే పరీక్ష రాయడంలోనూ ఇది వర్తిస్తుంది. పరీక్షలో మొత్తం ఐదు విభాగాలు ఉంటాయి. రెండు వందల ప్రశ్నలు ఇస్తారు. ఇందుకుగాను కేటాయించిన సమయం రెండు గంటల ముప్పై నిమిషాలు. అంటే 150 నిమిషాల్లో 200 ప్రశ్నలకు సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ప్రశ్నకు అందుబాటులో ఉన్న సమయం 45 సెకన్లు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో ప్రశ్న చదివి, అర్థం చేసుకొని, దానికి జవాబు కనుగొనాలి. సిలబస్‌లో పేర్కొన్న వివిధ విభాగాల్లో ప్రశ్నల కఠినస్థాయి ఆధారంగా ప్రణాళిక ఉంటే మంచిది.
సిలబస్ ఒకటే
ఆఫీసర్, క్లర్క్ పోస్టులకు ఒకే తరహా సిలబస్‌ను ఇచ్చారు. అయితే ప్రశ్నల కఠిన స్థాయిలో మాత్రం కచ్చితంగా భిన్నత్వం ఉంటుంది. ఆఫీసర్ పోస్టుల్లో ప్రశ్నలు కఠినంగా ఉంటాయి. అయితే చాలామంది అభ్యర్థులు ఏది ప్రిపేర్ కావాలో తెలియక గందరగోళానికి గురవుతారు. అభ్యర్థులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్స్‌పై పూర్తిస్థాయిలో పట్టు ఉంటే, ఎంత కఠినంగా ఉన్న ప్రశ్న అయినా సరే తేలికగా సమాధానం కనుక్కోవొచ్చు. విభాగాల వారీగా ప్రిపరేషన్ తీరును పరిశీలిస్తే.....
Integrated Preparation for General Studies(TM)
పోటీపరీక్షలకు ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించాం. వాటికి సమగ్ర ప్రిపరేషన్ (ఇంటిగ్రెటెడ్ ప్రిపరేషన్) చేస్తే చాలాతక్కువ సమయంలో ఉద్యోగం సాధించవచ్చు. సాధారణంగా అన్ని పరీక్షల్లో కామన్‌గా ఉన్న అంశాలు, జనరల్ స్టడీస్, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్. ముందుగా జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ విధానాన్ని ఈ పరిశీలిద్దాం...
జనరల్ స్టడీస్:
సివిల్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, హయ్యర్ సెకండరీ లెవెల్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించే పరీక్షలు, రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్-1, గ్రూప్-2, ఎస్,ఐ., పోలీస్ కానిస్టేబుల్ తదితర పరీక్షల్లో ఉంటాయి. వీటిలో అంశాలు అవే అయినా పరీక్షస్థాయిని బట్టి కఠినత్వం మారుతుంది. సాధారణంగా చరిత్ర, పాలిటీ, ఎకానమి, సైన్స్, భూగోళశాస్త్రం (జాగ్రఫీ) అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ మినహా మిగతా పరీక్షల్లో ప్రశ్నలు నేరుగా, పెద్దగా విశ్లేషణ కోణంలో కాకుండా అడుగుతారు. ఉదాహరణకు గతంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో అడిగిన ప్రశ్నను చూద్దాం..
How to prepare for IBPS Exam? - Telugu Medium Review
ఇండియన్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) . డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసినవారితో పాటు డిగ్రీ పూర్తిచేసిన వారికి ఇదో సువర్ణావకాశం. పక్కా ప్రణాళికతో సిద్ధమయితేబ్యాంక్ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.
విద్యార్థులు ఏం చేయాలి: ప్రిపరేషన్లో రెండు అంశాలు కీలకమైనవి. అవి..
1. కాన్సెప్ట్ బిల్డింగ్
2. ప్రాక్టీస్
2. ప్రాక్టీస్
ఈ రెండు దశల ప్రారంభానికి ముందే సిలబస్పై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలి.
పీవో, క్లర్క్ పరీక్షల సిలబస్:
పీవో, క్లర్క్ పరీక్షల సిలబస్ పరంగా చూస్తే దాదాపుగా ఒకే తరహా అంశాలు కనిపిస్తాయి.ప్రశ్నల కఠినస్థాయిలోనే తేడా ఉంటుంది. రీజనింగ్, ఆప్టిట్యూడ్ విభాగాల్లో ఇది స్పష్టంగాకనిపిస్తుంది. ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ తదితరవిభాగాల్లో పెద్దగా తేడా ఉండదు.
రీజనింగ్లో తేడా..
ప్రొబేషనరీ పరీక్షల్లో క్లర్క్ సిలబస్కు అదనంగా మరికొన్ని అంశాలు ఉంటాయి. అవి కాజ్అండ్ ఎఫెక్ట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్-అసంప్షన్స్, స్టేట్మెంట్-కన్‌క్లూజన్స్, డాటాసఫీషియన్సీ.
గ్రూప్-2లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అని రెండు క్యాటగిరీలు ఉన్నాయి అని విన్నాను. అయితే వీటి అర్ధం ఏమిటి?
ఎపిపిఎస్‌సి నిర్వహించే రిక్రూట్‌మెంట్లలో గ్రూప్-2లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అని రెండు క్యాటగిరీలు ఉన్నాయి అని విన్నాను. అయితే వీటి అర్ధం ఏమిటి? ఈ జాబ్స్ విధి విధానాలు ఎలా ఉంటాయి? తెలియచేయగలరు?
జ ః ఎపిపిఎస్‌సి నిర్వహించే రిక్రూట్‌మెంట్లలలో గ్రూప్-1 అత్యున్నత సర్వీసులు కాగా గ్రూప్-2 రెండవ అత్యున్నత సర్వీసులు నిజానికి ప్రభుత్వ యంత్రాం గంలో ఫీల్డ్ లెవల్‌లో, యూనిట్ ఆఫీస్‌లలో గ్రూప్-2 ఉద్యోగులే క్రియాశీలపాత్ర పోషిస్తారు. అందువల్ల ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుందియగూప్-2 ఉద్యోగాలను వాటి విధులు, స్వభావం, అధికా రాలు, తదితర అంశాల ఆధారంగా ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాటగిరీలుగా విభజించడం జరిగింది. ప్రభుత్వ విధానాలను ప్రత్యక్షంగా అమలుచేసే (ఎగ్జిక్యూట్) వాటిని ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలని, ఈ
జ ః ఎపిపిఎస్‌సి నిర్వహించే రిక్రూట్‌మెంట్లలలో గ్రూప్-1 అత్యున్నత సర్వీసులు కాగా గ్రూప్-2 రెండవ అత్యున్నత సర్వీసులు నిజానికి ప్రభుత్వ యంత్రాం గంలో ఫీల్డ్ లెవల్‌లో, యూనిట్ ఆఫీస్‌లలో గ్రూప్-2 ఉద్యోగులే క్రియాశీలపాత్ర పోషిస్తారు. అందువల్ల ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుందియగూప్-2 ఉద్యోగాలను వాటి విధులు, స్వభావం, అధికా రాలు, తదితర అంశాల ఆధారంగా ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాటగిరీలుగా విభజించడం జరిగింది. ప్రభుత్వ విధానాలను ప్రత్యక్షంగా అమలుచేసే (ఎగ్జిక్యూట్) వాటిని ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలని, ఈ
ఎపిపిఎస్‌సి ఎగ్జామ్స్ దీర్ఘకాలిక వ్యూహం విజయసోపానం!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి త్వరలో వివిధ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఈ నోటిఫికేషన్ల కోసం లక్షలాదిమంది అభ్యర్ధులు ఎదురుచూస్తున్నారు. వివిధ కారణాలవలన లేటయిన ఈ నోటిఫికేషన్లలో పంచాయతీ సెక్రటరి, వి.ఆర్.ఒ, గ్రూప్-2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్... ఇలా వివిధ రకాల పోస్టులున్నాయి. ఇవేకాక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇతర పోస్టులను భర్తీచేయడానికి ఆవెూదం తెలిపింది. మరి ఈ పోస్టులకు ఎలా ప్రిపేర్ కావాలి? ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఎటువంటి వ్యూహం అవలంభించాలి?
తెలివైన అభ్యర్థ్ధులు ముందే మేల్కొంటారు
సాధారణంగా పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్ధుల్లో 70 నుంచి 80శాతం మంది అభ్యర్ధులు నోటిఫికేషన్ వచ్చిన తరువాతే తమ ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. దీనికి ప్రధాన కారణం నోటిఫికేషన్లు వస్తాయో, రావో ఒకవేళ వచ్చినా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఎలా ప్రిపేరవుతామని అభ్యర్ధులు భావించడమే. కానీ సరిగ్గా ఇక్కడే తెలివైన అభ్యర్ధులు తమ తెలివితేటలు ప్రదర్శిస్తారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అని ఒకపక్క ఆరా తీస్తూనే మరోపక్క తమ ప్రిపరేషన్ ప్రారంభించి కొనసాగిస్తూనే ఉంటారు. దీనివలన నోటిఫికేషన్ వచ్చేనాటికి వీరి ప్రిపరేషన్ ఒకసారి పూర్తయిపోవడవెూ లేక మెజారిటీ పోర్షన్ కంప్లీట్ చేయడవెూ జరుగుతుంది. ఫలితంగా పరీక్ష తేదీనాటికి వీరు అనేకసార్లు సిలబస్ రివిజన్ చేసి పరీక్షలకు పూర్తి సంసిద్ధులై ఉంటారు. మిగిలినవారంతా ప్రిపరేషన్ పూర్తిచేయలేక, ఒకవేళ పూర్తిచేసినా రివిజన్ చేయలేక అపనమ్మకంతో పరీక్షలు రాస్తారు. ఫలితంగా నిరాశే ఎదురవుతుంది.
వ్యూహం అన్నింటికన్నా ప్రధానం
సాధించాలని అనుకున్న లక్ష్యం ఏదైనా, దానికి అన్నింటికన్నా ప్రధాన మైంది వ్యూహం. ముఖ్యంగా జీవితంలో స్థిరపడటానికి తోడ్పడే ప్రభుత్వ ఉద్యోగ సాధనకు
తెలివైన అభ్యర్థ్ధులు ముందే మేల్కొంటారు
సాధారణంగా పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్ధుల్లో 70 నుంచి 80శాతం మంది అభ్యర్ధులు నోటిఫికేషన్ వచ్చిన తరువాతే తమ ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. దీనికి ప్రధాన కారణం నోటిఫికేషన్లు వస్తాయో, రావో ఒకవేళ వచ్చినా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఎలా ప్రిపేరవుతామని అభ్యర్ధులు భావించడమే. కానీ సరిగ్గా ఇక్కడే తెలివైన అభ్యర్ధులు తమ తెలివితేటలు ప్రదర్శిస్తారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అని ఒకపక్క ఆరా తీస్తూనే మరోపక్క తమ ప్రిపరేషన్ ప్రారంభించి కొనసాగిస్తూనే ఉంటారు. దీనివలన నోటిఫికేషన్ వచ్చేనాటికి వీరి ప్రిపరేషన్ ఒకసారి పూర్తయిపోవడవెూ లేక మెజారిటీ పోర్షన్ కంప్లీట్ చేయడవెూ జరుగుతుంది. ఫలితంగా పరీక్ష తేదీనాటికి వీరు అనేకసార్లు సిలబస్ రివిజన్ చేసి పరీక్షలకు పూర్తి సంసిద్ధులై ఉంటారు. మిగిలినవారంతా ప్రిపరేషన్ పూర్తిచేయలేక, ఒకవేళ పూర్తిచేసినా రివిజన్ చేయలేక అపనమ్మకంతో పరీక్షలు రాస్తారు. ఫలితంగా నిరాశే ఎదురవుతుంది.
వ్యూహం అన్నింటికన్నా ప్రధానం
సాధించాలని అనుకున్న లక్ష్యం ఏదైనా, దానికి అన్నింటికన్నా ప్రధాన మైంది వ్యూహం. ముఖ్యంగా జీవితంలో స్థిరపడటానికి తోడ్పడే ప్రభుత్వ ఉద్యోగ సాధనకు
గ్రూప్-2 ఎకానమీ చదివేదెలా?
నాది గ్రామీణ నేపథ్యం, కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. సొంతంగా ప్రిపేర్ అవుతున్నాను. డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో పూర్తి చేశాను. గ్రూప్-2లో మొదటి, రెండవ పేపర్లకు భాగానే ప్రిపేరవుతున్నాను. కానీ ఎకానమి పేపర్ గందరగోళంగా ఉంది. ఎకానమీకి అకాడమీ పుస్తకాలు చదువుతున్నాను. కానీ అవి గ్రూప్-2 సిలబస్‌కు అనుగుణంగా లేకపోవడం వలన ఏవి చదవాలో, ఏవి వదిలేయాలో తెలియడం లేదు. ఎకానమీలో నేను గట్టెక్కడానికి పరిష్కారం చూపగలరు?
జ : ముందుగా మీరు మానసికంగా ప్రిపేర్‌కావాలి. గ్రామీణ నేపథ్యం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌తో ఐ.ఎస్ సాధించిన ఉదహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆత్మవిశ్వాసంతో ఆశావాద దృక్పథంతో ప్రిపేర్ కాగలిగితే అంతిమ విజయం మీదేనని బలంగా నమ్మాలి. వేలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలను పొందుతున్నప్పుడు అది మనెందుకు సాధ్యం కాదన్న ప్రశ్న వేసుకోవాలి. గ్రూప్-2లో ఉద్యోగం పొందాలంటే డిగ్రీలు, కోచింగ్‌లు, ఆర్థిక స్థోమత, అదృష్టం వంటి అంశాలకన్నా కఠోర దీక్షతో, పట్టుదలతో నిరంతరం తెలుసుకోవాలన్న తపనతో, సాధించాలన్న కసితో ఒక యజ్ఞంలాగా సరైన గైడెన్స్‌తో శాస్త్రీయ పద్ధతిలో ప్రిపేర్ కావడానికే అధిక
కరెంట్ అఫైర్స్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు చదవాలో తెలియడం లేదు. సాధారణంగా దీనికి సంబంధించి ఎపిపిఎస్‌సి ఎన్ని నెలలు కవర్ చేస్తుంది? కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ విడుదలయ్యాక చదవడం మంచిదా?
ఎపిపిఎస్‌సి నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. అయితే జనరల్ స్టడీస్‌లో కరెంట్ అఫైర్స్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు చదవాలో తెలియడం లేదు. సాధారణంగా దీనికి సంబంధించి ఎపిపిఎస్‌సి ఎన్ని నెలలు కవర్ చేస్తుంది? కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ విడుదలయ్యాక చదవడం మంచిదా? సలహా ఇవ్వండి? - కె.హరిత, మిర్యాలగూడ.
జ : ఎపిపిఎస్‌సి నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలలో జనరల్‌స్టడీస్ తప్పనిసరి పేపర్‌గా ఉండటం, ఇందులో కరెంట్ అఫైర్స్ అత్యంత కీలకంగా ఉన్నందున అభ్యర్థులందరూ ఈ అంశానికి అధిక ప్రాధాన్యత నివ్వాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న అనేక మంది అభ్యర్థులకు కూడా ప్రధాన సందేహంగా ఉన్నది.జనరల్ స్డడీస్‌లో కరెంట్ అఫైర్స్ అంటే ఎంత కాలం నుండి జరిగిన సంఘటనలను చదవాలన్న నిర్ధిష్ట కాలపరిమితి లేదు కాకపోతే పరీక్ష జరిగే నాటికి ముందు ఒక సంవత్సర కాలంలో జరిగిన ముఖ్యమైన అంశాలను చదవడం మంచిది. కరెంట్ అఫైర్స్‌ను జనరల్ స్టడీస్‌లోని ఎకానమీ, పాలిటీ, సైన్స్ & టెక్నాలజీ విభాగాలలో నూతన అంశాలుగా భావించి చదవగలిగితే ఏక కాలంలో అనేక అంశాలు కవర్ అవ్వడమే కాకుండా ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించడానికి అవకాశం కలుగుతుంది. కరెంట్ అఫైర్స్‌లో జనరల్‌గా ఉండే అవార్డులు, క్రీడలు, సమావేశాలు,సొంతనోట్స్ ప్రిపేర్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సాధారణంగా పోటీపరీక్షలకు రెడిమేడ్ నోట్స్‌పైనే ఎక్కువ మంది అభ్యర్థులు ఆధారపడుతుంటారు. అయితే పరీక్షలకు సొంతంగా నోట్స్‌ని తయారుచేసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు. ఇలా సొంతనోట్స్ ప్రిపేర్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ : సాధారణంగా పోటీపరీక్షలకు సంబంధించి పోస్టుల సంఖ్య కేవలం వందల్లో (అరుదుగా వేయికిపైగా ఉంటాయి) ఉండగా వాటి కోసం పోటీపడే అభ్యర్థుల సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది. సాధారణంగా ఏ పోటీ పరీక్షలలోనైనా పోటీ తీవ్రంగానే ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడమే అంతిమ లక్ష్యంగా సంవత్సరాల తరబడి నిద్రాహారాలు మానుకొని సీరియస్‌గా ప్రిపేరయ్యే అభ్యర్థులు 40 శాతం వరకు ఉంటారు. నిజానికి అంతిమ విజేతలలో వీరే ఎక్కువగా ఉంటారు. మిగతావారు నాన్‌సీరియస్ అభ్యర్థులే. అందువల్ల సీరియస్‌గా ప్రిపేరయ్యేSaturday, 3 September 2016
Subscribe to:
Comments (Atom)

